Amma Vodi Scheme : Nagari YSRCP MLA Roja Attended Jagananna Amma Vodi Scheme Launch At Chittoor.
#Ammavodischeme
#mlaroja
#jaganannaammavodischeme
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 'అమ్మ ఒడి' పథకం విప్లవాత్మకమైనదని ఏఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. పేదింటి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతోనే జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. భవిష్యత్ తరాల పిల్లలు అ అంటే అమ్మ ఒడి,ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని నేర్చుకుంటారని చెప్పారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్,మాజీ సీఎం చంద్రబాబుల మధ్య చాలా తేడా ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. గురువారం చిత్తూరు జిల్లాలో జరిగిన అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ సభలో రోజా మాట్లాడారు.